* 9న అనుబంధ నోటిఫికేషన్ జారీ
* ఫిబ్రవరి 12న పరీక్ష.. 29న ఫలితాలు
ప్రభుత్వ ఉద్యోగాలకు వయోపరిమితి పెంచుతూ ఉత్తర్వులు వెలువడిన నేపథ్యంలో గ్రామ రెవెన్యూ అధికారులు(వీఆర్‌ఓ), గ్రామ రెవెన్యూ సహాయకుల(వీఆర్‌ఏ) పోస్టులకు కొత్త అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 9వతేదీ నుంచి 18వ తేదీ వరకూ అవకాశం కల్పించాలని రెవెన్యూశాఖ నిర్ణయించింది. ఈమేరకు సవరించిన కొత్త షెడ్యూలుతో ఈనెల 9న అనుబంధ నోటిఫికేషన్ జారీ చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు రెవెన్యూశాఖ మంత్రి రఘువీరారెడ్డి ఆదేశాలు జారీ చేశారు. పరీక్షలు ఫిబ్రవరి 12న జరుగుతాయని తెలిపారు.
పరీక్ష రోజు అభ్యర్థులు సకాలంలో కేంద్రాలకు చేరుకునేందుకు వీలుగా అదనంగా ఆర్టీసీ బస్సులు నడిపేలా ఉన్నతాధికారులతో మాట్లాడాలని సూచించారు. వీఆర్వో, వీఆర్‌ఏ పరీక్షలు, మూల్యాంకనం అత్యంత పకడ్బందీగా నిర్వహిస్తామని, ప్రతిభే కొలబద్దగా ఎంపికలు ఉంటాయన్న విషయాన్ని విసృ్తతంగా ప్రచారం చేయాలని కోరారు. పోస్టులు ఇప్పిస్తామంటూ వసూళ్లకు పాల్పడే దళారులపై కఠి నంగా వ్యవహరించేలా ఎస్పీలతో మాట్లాడాలని కలెక్టర్లను ఆదేశించారు.
వీఆర్‌వో, వీఆర్‌ఏ పోస్టులకు షెడ్యూలు
ఇదీ పరీక్షల షెడ్యూల్...
* జనవరి 9న వీఆర్‌వో, వీఆర్‌ఏ పోస్టుల అనుబంధ నోటిఫికేషన్ జారీ
* 9వతేదీ నుంచి 17వ తేదీ సాయంత్రం 5 గంటల వరకూ ఫీజు చెల్లింపు గడువు. 18 వరకూ దరఖాస్తులు సమర్పించవచ్చు... జనవరి 27 నుంచి హాల్‌టికెట్ల డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
* ఫిబ్రవరి 12వ తేదీ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 వరకూ వీఆర్‌ఓ పరీక్ష జరుగుతుంది. అదేరోజు సాయంత్రం 3 నుంచి 5 వరకూ వీఆర్‌ఏ రాత పరీక్ష నిర్వహిస్తారు.
* ఫిబ్రవరి 29న పరీక్ష ఫలితాల వెల్లడి.. మార్చి 8న నియామక పత్రాల జారీ
అందరికీ వయో పరిమితి పెంపు వర్తింపు
* గతంలో జనరల్ కేటగిరీ అభ్యర్థులకు 34 ఏళ్ల గరిష్ట వయోపరిమితి ఉండగా ఇప్పుడు 36 ఏళ్లకు పెంచారు... రెండేళ్ల వయో పరిమితి పెంపు అందరికీ వర్తిస్తుంది.
* వికలాంగ అభ్యర్థులకు కొత్త జీవో ప్రకారం 46 ఏళ్ల గరిష్ట వయోపరిమితి నిర్దేశించారు. వీరికి పరీక్ష ఫీజు నుంచి మినహాయింపు కల్పించారు. గతంలో దరఖాస్తు చేసుకుని ఫీజు చెల్లించిన వారికి రీయింబర్స్ చేస్తారు.
* అభ్యర్థులు www.ccla.cgg.gov.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
* ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నవారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు.
No comments:
Post a Comment