గ్రామ రెవెన్యూ అధికారి(వీఆర్‌ఓ), గ్రామ రెవెన్యూ సహాయకుల(వీఆర్ఏ) రాత పరీక్షను ఒక రోజు ముందుగానే నిర్వహించే అవకాశాలున్నాయని సీసీఎల్ఏ కమిషనర్ జె. సత్యనారాయణ తెలిపారు. తొలుత వీఆర్‌ఓ, వీఆర్ఏ రాత పరీక్షలను ఫిబ్రవరి 12న నిర్వహించాలని రెవెన్యూశాఖ నిర్ణయించింది. అయితే అదే రోజున గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఆఫ్ ఇంజనీరింగ్ (గేట్) పరీక్ష కూడా ఉన్నందున తాము రెండు పరీక్షల్లో ఒక పరీక్షను రాసే అవకాశం కోల్పోతామని ఇంజనీరింగ్ పట్టభద్రులు ఆందోళన వ్యక్తంచేశారు. ఈ మేరకు శుక్రవారం రెవెన్యూ మంత్రి రఘువీరారెడ్డి కలిసి పరీక్ష తేదీని మార్చాలని కోరారు. ఈ నేపథ్యంలో పరీక్ష తేదీని ఒక రోజు ముందుగానే నిర్వహించనున్నారు. ఈ పోస్టులకు సంబంధించిన అనుబంధ నోటిఫికేషన్ జనవరి 9 న వెలువడనుంది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment