* 4 వేల మంది నియామకానికి అవకాశాలు
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఆధ్వర్యంలో నవంబరు 20న హైదరాబాద్‌లో భారీ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ అధికారులు నవంబరు 20న ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ఉన్న బంజారా ఫంక్షన్ హాల్‌లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దాదాపు 4 వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు 40 కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయని అధికారులు చెప్పారు. వీటిలో శుభ గ్రుహ, సువర్ణ భూమి, రిలయన్స్, మెడి-ప్లస్, భారతి వాల్ మార్ట్, స్టెర్లింగ్ హోం కేర్, యురేకా ఫోర్బ్స్, ఆటోఫిన్ హోండా, అపోలో ఫార్మసీ, హెరిటేజ్ ఫుడ్స్ తదతర కంపెనీలు ఉన్నాయి. మేళాలో పాల్గొనే అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల ప్రాథమిక సౌకర్యాలు కల్పిస్తున్నారు.
No comments:
Post a Comment