* 4.60 లక్షల మంది దరఖాస్తు హైదరాబాద్: ఎక్సైజ్‌శాఖలో కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తు చేయడానికి నవంబరు 14వ తేదీ సాయంత్రంతో గడువు ముగిసింది. మొత్తం 2606 పోస్టులుండగా.. 4.60 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. తొలిగా నిర్వహించే ప్రాథమిక అర్హత పరీక్షకు నవంబరు 20వ తేది నుంచి హాల్‌టికెట్లను జారీ చేయాలని నిర్ణయించారు. వెబ్‌సైట్ ద్వారా అభ్యర్థుల హాల్‌టికెట్లు పొందవచ్చు. మొత్తం మూడు దశల్లో ఎంపిక ప్రక్రియ జరగనుంది. ప్రాథమిక అర్హత పరీక్షలో పురుషులు 4 కిలోమీటర్లు దూరాన్ని 20 నిమిషాలలో, మహిళా అభ్యర్థులు 2 కిలోమీటర్ల దూరాన్ని 13 నిమిషాలలో పూర్తిచేయాల్సి ఉంది. ఇందులో ఎంపికైన వారికి శరీర దారుఢ్య పరీక్షల కింద 100 మీటర్ల పరుగుపందెం, హైజంప్, లాంగ్‌జంప్, 800 మీటర్ల పరుగుపందెం నిర్వహిస్తారు. ఈ రెండు విడతల్లో ఎంపికైన వారికి 100 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. ఇందులో ఎంపికైన వారిని శిక్షణకు పంపిస్తారు. 18 ఏళ్ల అనంతరం ఎక్సైజ్‌శాఖ కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేయడంతో పాటు పదో తరగతిని విద్యార్హతగా నిర్ణయించడంతో పోటీ తీవ్రంగా ఉంది.
Hall Ticket for PQT can be downloaded from
11 AM on 20th
Nov,2012 onwards at http://cpe.cgg.gov.in
No comments:
Post a Comment