Find us on Google+ పక్షం రోజుల్లో వీఆర్ఓ, వీఆర్ఏ పోస్టుల నోటిఫికేషన్ ~ We Help Your Success...
Google Groups Subscribe to OurStudentsWorld
Email:
Web hosting

పక్షం రోజుల్లో వీఆర్ఓ, వీఆర్ఏ పోస్టుల నోటిఫికేషన్

గ్రామీణ ప్రాంత నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఇంతకాలం ఎదురు చూస్తున్న వీఆర్ఓ, వీఆర్ఏ పోస్టుల భర్తీకి లైన్ క్లియర్ అయ్యింది. మరో పక్షం రోజుల్లో 9000 వీఆర్ఓ, వీఆర్ఏ పోస్టల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. ఈ రోజు లేక్ వ్యూ గెస్ట్ హౌస్ లో జరిగిన మంత్రివర్గ ఉపసంఘం భేటీలో వీఆర్ఓ, వీఆర్ఏ పోస్టుల భర్తీకి సంబంధించిన మార్గదర్శకాలను మంత్రులు ఆమోదించారు.

విద్యార్హతలు
వీఆర్ఓ పోస్టుకు ఇంటర్మీడియోట్
వీఆర్ఏ పోస్టుకు పదోతరగతి

రిక్రూట్ మెంట్ విధానం
ఈ రెండు పోస్టుల భర్తీని మౌఖిక పరీక్షలు (ఇంటర్వ్యూలు) ద్వారా భర్తీ చేస్తారు. వీఆర్ఓ పోస్టుకు జిల్లా జాయింట్ కలెక్టర్ నేతృత్వంలోని పానెల్ కమిటీ ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది.
వీఆర్ఏ పోస్టులకు ఆర్డీఓ నేతృత్వంలోని ప్యానెల్ కమిటీ ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది.
రెండు పోస్టులకు 1:3 ప్రాతిపదికన ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.

ప్రాధాన్యాలు – వెయిటేజీ మార్కులు
  • అభ్యర్థి పాస్ అయిన సంవత్సరానికి వెయిటేజీ మార్కులుంటాయి. పదేళ్ల క్రితం పాసైన వారికి తాజాగా పాస్ అయిన వారికంటే ప్రాధాన్యం ఉంటుంది.  అభ్యర్థి నిర్ణీత విద్యార్హత సాధించిన సంవత్సరానికి రెండు నుంచి అయిదు వెయిటేజీ మార్కులుంటాయి
  • గ్రామీణ ప్రాంత యువతకు అయిదు మార్కుల మేర వెయిటేజీ ఉంటుంది
  • కంప్యూటర్ పై అవగాహన ఉండి, అందుకు సంబంధించిన సర్టిఫికెట్లు ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది
  • ఇప్పటికే రెవెన్యూ శాఖలో కాంట్రాక్టు పద్ధతిన పనిచేస్తున్నవారికి వెయిటేజీ మార్కులుంటాయి

నోటిఫికేషన్ – ఇతర వివరాలు
మరో పక్షం రోజుల్లో నోటిఫికేషన్ విడుదలకు అధికార యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది. నవబంరు చివరికల్లా రిక్రూట్ మెంట్లను పూర్తిచేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. డిసెంబరు మాసాంతానికి ఎంపికైన అభ్యర్థులకు శిక్షణను పూర్తిచేయాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. శిక్షణ పూర్తిచేసుకున్నవారంతా 2012 జనవరి ఒకటో తేదీ నుంచి విధుల్లో చేరతారు.

No comments:

Post a Comment

 
Design by Free WordPress Themes | Bloggerized by Lasantha - Premium Blogger Themes | Hot Sonakshi Sinha, Car Price in India