CLICK HERE to check VRO KEY 2012. CLICK HERE to check VRA KEY 2012.
విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ Question Paper With KEY
విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ Question Paper With KEY
మార్చి 12వ తేదీన విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్, విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్స్ పరీక్షా ఫలితాలు వెల్లడించనున్నామని చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ (సిసిఎల్‌ఎ) ఉన్నతాధికారులు తెలిపారు. ఆదివారం నిర్వహించిన పోటీ పరీక్షల్లో మెరిట్ సాధించిన అభ్యర్థులకు మార్చి 24న సెలక్షన్ ఆర్డర్లు పంపిస్తామని అధికారులు తెలిపారు. వి.ఆర్.ఓ పోస్టులకు ఎంపికయిన అభ్యర్థులకు నిర్ధేశిత కాలం ప్రొబేషనరీ శిక్షణ ఆయా జిల్లాల పరిధిలోనే అందించనున్నట్టు అధికారులు తెలిపారు. వి.ఆర్.ఓ, వి.ఆర్.ఎ పోస్టులకు అంచనాలకు మించి దరఖాస్తు చేసినట్లుగానే రాత పరీక్షకు 0 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారని అధికారులు తెలిపారు.
రాత పరీక్ష జరిగిన వెంటనే అభ్యర్థుల ఓ.ఎం.ఆర్ జవాబు పత్రాలు జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో నిర్ధేశిత వాల్యూయేషన్ సెంటర్లకు చేరుతున్నాయన్నారు. వి.ఆర్.ఓ, వి.ఆర్.ఎ ప్రశ్నా పత్రాల ‘కీ’ (సమాధానాలు) ఈ నెల 24న డిపార్ట్‌మెంట్ వెబ్‌సైటులో పెట్టనున్నట్టు సిసిఎల్‌ఎ అధికారులు తెలిపారు. జవాబులపై ఏమైనా అభ్యంతరాలుంటే సంబంధిత అధికారులకు ‘అబ్జెక్షన్స్’ పంపించవచ్చన్నారు. వాటిని సరిదిద్దిన తర్వాతే వాల్యూయేషన్ ప్రక్రియ చేపట్టి విఆర్‌ఓ, విఆర్‌ఎ పరీక్షా ఫలితాలు వెల్లడిస్తామన్నారు. మొత్తం మీద భారీ రిక్రూట్‌మెంట్‌గా పరిగణిస్తున్న విఆర్‌ఓ, విఆర్‌ఎ ఉభయ పోస్టులకు మొత్తం 11,5,047 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా అందులో 10,77,39 మంది అభ్యర్థులు పరీక్ష హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారు.
- అభ్యర్థుల ఓ.ఎం.ఆర్ జవాబు పత్రాలు వాల్యూయేషన్ సెంటర్‌కు తరలింపు ః వెంటనే చేపట్టారు
- వి.ఆర్.ఓ, వి.ఆర్.ఎ ‘కీ’ విడుదల -
ఫిబ్రవరి, 24
- జవాబులపై అభ్యంతరాల స్వీకరణ-
రెండు, మూడు రోజులు
- వాల్యుయేషన్ ప్రారంభం -
మార్చి మొదటివారం
- వి.ఆర్.ఓ, వి.ఆర్.ఎ పరీక్ష ఫలితాలు వెల్లడి -
మార్చి 12, 2012
- జిల్లా వారీగా పోస్టులకు అభ్యర్థుల ఎంపిక -
మార్చి మూడో వారం
- వి.ఆర్.ఓ, వి.ఆర్.ఎ సెలక్షన్ ఆర్డర్లు జారీ -
మార్చి 24, 2012
- వి.ఆర్.ఓ అభ్యర్థులకు ప్రొబేషనరీ శిక్షణ ప్రారంభం -
ఏప్రిల్ మొదటివారం
No comments:
Post a Comment