Find us on Google+ పంచాయితీ సెక్రటరీ పోస్టులోస్తున్నాయ్! ~ We Help Your Success...
Google Groups Subscribe to OurStudentsWorld
Email:
Web hosting

పంచాయితీ సెక్రటరీ పోస్టులోస్తున్నాయ్!

పంచాయితీ సెక్రటరీ పోస్టులోస్తున్నాయ్!
మీ ప్రాంతంలోనే ప్రభుత్వోద్యోగం చేయాలని వి.ఆర్.ఓ ఎగ్జామ్ రాస్తున్నారా? ఒక వేళ ఆ ఛాన్స్ మిస్ అయితే ఎలాఅని మధన పడుతున్నారా? మీ ప్రాంతంలోనే గవర్నమెంట్ జాబ్ చేసే మరో మంచి అవకాశం మీ ముందుకు వస్తోంది. అయితే ఒక చిన్న మార్పు. వి.ఆర్.ఓకు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ కాగా ఇప్పుడు రాబోతున్న విలేజ్ సెక్రటరీ పోస్టుకు డిగ్రీ కనీస విద్యార్హత. వి.ఆర్.ఓ కంటే ఉన్నతమైన విలేజ్ సెక్రటరీ గురించి వివరాలు.గ్రామంలోని ప్రజలకు ప్రభుత్వ అధికారిగా సేవలు అందించాలని ఉవ్విళ్లూరుతున్నారా? మీ గ్రామం లేదా ఇరుగు పొరుగు గ్రామాల్లో గవర్నమెంట్ జాబ్ అందుకోవాలని మీకు ఆసక్తి ఉందా? ఒక నిరుపేదకు సొంత గూడు ఏర్పర్చుకు నేందుకు మంజూరు పత్రం జారీ చేసే ప్రభుత్వ సర్వెంట్‌గా మీకు పని చేయాలని ఉందా? గ్రామ ప్రజలకు నిత్యం అభివృద్ధి కార్యక్రమాలు రూపొందించి అమలు చేయాలనే గవర్నమెంట్ ఆఫీసర్‌గా చెలామణి కావాలనుందా? వీటన్నింటికీ ఒకే రహదారి పంచాయతీ సెక్రటరీ రిక్రూట్‌మెంట్. రెండు దశాబ్దాల తర్వాత తొలిసారిగా భారీగా 2700 ఖాళీలతో వస్తున్న పంచాయతీ సెక్రటరీ పోస్టుల రిక్రూట్‌మెంట్ త్వరలో నిరుద్యోగ అభ్యర్థుల ముందుకు రానున్నది.

ఇంతకీ ఎవరీ పంచాయతీ సెక్రటరీ?
పంచాయతీరాజ్ శాఖ పరిధిలో గ్రామ పంచాయతీ కార్యాలయాల వ్యవస్థ ఏర్పాటై దశాబ్దాల నుంచి కొనసాగుతుం ది. పది లక్షలు ఆదాయం దాటిన గ్రామ పంచాయతీల నుంచి మూడు లక్షల ఆదాయం ఏటా వస్తున్న గ్రామ పంచాయతీ కార్యాలయాలను నాలుగు రకాలుగా విభజించి నిర్దేశిత సేవలు అందిస్తున్నారు. రాష్ట్రంలో 21,09 గ్రామాలు ఉండగా, ప్రతి గ్రామ పంచాయతీకి ఒక పంచాయతీ సెక్రటరీని ప్రభుత్వం నియమిస్తూ స్థానిక పాలనకు నిర్దిష్ట సేవలు అందించాల్సి ఉంటుంది. ఇంటి పన్ను వసూలు నుంచి ఇంటి నిర్మాణం అనుమతి వరకు, వ్యాపార అనుమతి పత్రం మంజూరు నుంచి బర్త్ సర్టిఫికెట్ల మంజూరు వరకు వేర్వేరు వృత్తి బాధ్యతలు పంచాయతీ సెక్రటరీ నిర్వర్తించాల్సి ఉంటుంది. గ్రామ పంచాయతీ సర్పంచి, పాలకసభ్యుల కమిటీ తీసుకునే విధాన నిర్ణయాలు అమలు చేసే బాధ్యతల వరకు పంచాయతీ సెక్రటరీ నిర్వర్తిస్తుంటారు. పంచాయతీ సెక్రటరీకి సిబ్బంది యంత్రాం గంలో జూనియర్ అసిస్టెంట్, బిల్‌కలెక్టర్, పైప్‌లైన్ పిట్టర్, ఎలక్ట్రిషన్, లైన్‌మెన్, స్వీపర్లు వంటి ఉద్యోగులు ఉంటారు.

పంచాయతీ సెక్రటరీ ఏం చేయాలి?
ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ యాక్ట్ (1994) ప్రకారం..పంచాయతీ సెక్రటరీ విధులు నిర్దేశించారు. గతంలో విలేజ్ అడ్మినిస్ట్రేటీవ్ ఆఫీసర్‌గా పిలువబడిన వారే నేడు పంచాయతీ సెక్రటరీలుగా కొనసాగుతున్నారు. 2007లో మారిన పరిస్థితుల నేపథ్యంలో పంచాయతీ సెక్రటరీలకు విధులు, బాధ్యతలు మొత్తం 51 రకాలుగా నిర్దేశించారు. రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లో విలేజ్ రెవెన్యూ ఆఫీసర్‌కు ఏవైతే వృత్తి బాధ్యతలు (ఇవి 51) ఉన్నాయో వాటినే పంచాయతీ సెక్రటరీలకు కొన సాగించేలా కొత్త రూల్స్ వచ్చాయి. ప్రభుత్వ పరంగా అడ్మినిస్ట్రేటివ్, విధులు కమ్యూ నిటీ వెల్ఫేర్ డెవలప్‌మెం ట్ విధులు, కోఆర్డినేషన్ విధు లు, మిస్‌లేనియన్ విధులు, ఇలా నాలుగు రకాల బాధ్య తలు పంచాయతీ సెక్రటరీ నిర్ణయిం చాల్సి ఉంటుంది. నిర్దేశిత గ్రామ పంచాయతీ పరిధిలోకి వచ్చే ప్రాంతం, ప్రజల అవసరాల మేరకు పైన చెప్పిన ఉద్యోగ బాధ్యతలు పంచాయతీ సెక్రటరీ నిర్వర్తించాల్సి ఉంటుంది.

పంచాయతీ సెక్రటరీ కెరీర్ ఎలా ఉంటుంది?
పంచాయతీ సెక్రటరీగా కెరీర్ ప్రారంభించిన అభ్యర్థులు కెరీర్ క్రమంలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పంచాయతీ రాజ్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ (ఇఓ-పిఆర్‌డి) స్థాయి వరకు చేరుకునే అవకాశం ఉంది. డిపార్ట్‌మెంట్ స్టక్చర్‌లో పైస్థాయిలో ఉద్యోగు లు ఎక్కువ సంఖ్యలో లేనందున పంచాయతీ సెక్రటరీలకు వెంటవెంటనే పదోన్నతులు లభించవు. పంచాయతీ సెక్రటరీ గ్రేడ్-4 పోస్టులలో ఎంపికయిన అభ్యర్థి ఆరేడు ఏళ్లలో జూనియర్ అసిస్టెంట్‌కు సమానమైన పంచాయతీ సెక్రటరీ గ్రేడ్-3కు పదోన్నతిపై వెళ్తుంటారు. ఆ తర్వాత ఆరేడు ఏళ్ళకు సీనియర్ అసిస్టెంట్ పోస్టుకు సమానమైన పంచాయతీ సెక్రటరీ గ్రేడ్-1కు పదోన్నతి పొందుతారు. పంచాయతీ సెక్రటరీ ఉద్యోగులు ఈ పదోన్నతి క్రమంలో గ్రూప్-2 రిక్రూట్‌మెం ట్‌లో భర్తీ చేయనున్న ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పంచాయతీ రాజ్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ (ఇఓపిఆర్‌డి) పోస్టులోకి పంచాయతీ సెక్రటరీ పదోన్నతిపై వెళ్ళి విధులు నిర్వర్తించేలా పదోన్నతి అవకాశాలు ఉంటాయి.

మరి భర్తీ ఎలా?
పంచాయతీ సెక్రటరీ పోస్టులను జిల్లా ప్రాంతాన్ని యూనిట్‌గా చేసుకుని భర్తీ చేస్తారు. డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ (డిఎస్‌సి) నేతృత్వంలో పంచాయతీ సెక్రటరీ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కమిషనర్ పంచాయతీరాజ్ ముఖ్య కార్యాలయం పర్యవేక్షణలో పూర్తికానుంది. ఇటీవల జరుగుతున్న విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్, విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ ఆఫీసర్ పోస్టుల భర్తీ పద్ధతిలో పంచాయతీ సెక్రటరీ పోస్టుల రిక్రూట్‌మెంట్ ప్రక్రియను పంచాయతీ రాజ్ చేపట్టనుందని తెలిసింది. రాష్ట్రస్థాయిలో కామన్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్, ఎగ్జామ్ షెడ్యూల్, దరఖాస్తుల షెడ్యూల్, వాల్యూయేషన్, ఫలితాల ప్రకటనలకు సంబంధించి కామన్ షెడ్యూల్‌తో పంచాయతీ సెక్రటరీల నోటిఫికేషన్‌ను జిల్లా స్థాయిలో ఎక్కడికక్కడ ప్రకటించ నున్నారని సమాచారం. నేడో రేపో రాష్ట్ర ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు అందిన వెంటనే పంచాయతీ సెక్రటరీ నోటిఫికేషన్ జారీ చేస్తామని పంచాయతీ రాజ్ ఉన్నతాధికా రులు చెప్పారు.

ఈ పోస్టులకు ఎవరు అర్హులు?
post-telangana-News talangana patrika telangana culture telangana politics telangana cinemaఏదేని బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఎవరైనా పంచాయతీ సెక్రటరీ పోస్టులకు పోటీపడవచ్చు. పురుషుల తోపాటు మహిళా అభ్యర్థులు 33 1/3 శాతం రిజర్వేషన్ మేరకు పంచాయతీ సెక్రటరీ పోస్టులకు పోటీపడవచ్చు. కనీసం 1 ఏళ్ళ నుంచి గరిష్టంగా36 ఏళ్ళు( తాజా రెండేళ్ళ సడలింపుతో కలుపుకుని) వయస్సు గల అభ్యర్థులు పంచా యతీ సెక్రటరీ పోస్టులకు పోటీపడొ చ్చు. బిసి, ఎస్‌సి, ఎస్‌టి, ప్రభుత్వ ఉద్యోగులకు గరిష్ట వయఃపరిమితలో 5 ఏళ్ళ సడలింపు ఉంటుంది. పంచాయతీ సెక్రటరీ గ్రేడ్-4 పోస్టులు రికార్డ్, అసిస్టెంట్ పోస్టులకు సమానమైనవి. రికార్డ్ అసిస్టెంట్స్, అటెండర్స్, ఫ్యూన్ వంటి దిగువ స్థాయి ఉద్యోగాలు జిల్లా స్థాయిలో ఎన్ని ఏర్పడినా, సదరు పోస్టుల్లో జిల్లా స్థానిక అభ్యర్థులతో భర్తీ చేయాలని ఎ.పి. సబార్డినేట్ సర్వీసు రూల్స్ స్పష్టం చేస్తున్నాయి. కాబట్టి రాబోయే పంచాయతీ సెక్రటరీ గ్రేడ్-4 ఉద్యోగాలకు సొంత జిల్లా అభ్యర్థులే పోటీపడాలి. పాఠశాల చదువులో 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఎక్కువ సంవత్సరాలు ఏ జిల్లా ప్రాంతంలో పూర్తి చేశారో, ఆ సదరు జిల్లా ప్రాంతంలో ప్రకటించే పంచాయతీ సెక్రటరీ గ్రేడ్-4 పోస్టులకు స్థానికులవుతారు. ఇతర జిల్లాల అభ్యర్థులు సదరు పోస్టులకు దరఖాస్తు చేసే అవకాశం ఉండదు. పాఠశాల చదువులేని అభ్యర్థులు, నేరుగా దూరవిద్య ద్వారా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు స్థానిక తహశీల్దార్ నుంచి నివాస ధృవీకరణ పత్రాలతో సొంత జిల్లా పంచాయతీ సెక్రటరీ గ్రేడ్-4 పోస్టులకు పోటీ పడొచ్చు.


ప్రజలతో నిత్యం మమేకమైన వృత్తి
బర్త్ సర్టిఫికెట్ నుంచి ఇంటి నిర్మాణం వరకు కావాల్సిన అనుమతి పత్రాలు మంజూరు చేయడం వంటి అనేక రకాల విధులు, బాధ్యతలు కలిగిన పంచాయతీ సెక్రటరీ నిత్యం ప్రజలతో మమేకం కావాల్సి ఉంటుంది. పేదా గొప్ప అందరూ పంచాయతీ కార్యాలయాలకు తమ నిత్య అవసరాల కోసం వస్తుంటారు. సేవ చేసే దృష్టితో ప్రతివారికి అనుమతులు మంజూరు చేయాల్సి ఉంటుంది. నిర్దిష్ట గ్రామంలోని పౌరులకు కావాల్సిన సేవలు, అభివృద్ధి పనులు అన్నింటికీ ముఖ్య అధికారిగా పంచాయతీ సెక్రటరీ విధులు చేపట్టాల్సి ఉంటుంది. ఇంటి పన్ను వసూళ్ళు నుంచి నల్లా కనెక్షన్స్ వరకు అనుమతులకు సంబంధించి పంచాయతీ సెక్రటరీ విధులు కొనసాగుతుంటాయి. చిన్నచిన్న గ్రామాలలో పన్నులు చెల్లించాలనే చైతన్యం స్థానిక ప్రజల్లో ఉండదు. అటువంటి వారి నుంచి ఇంటి పన్నులు వసూలు చేస్తూ దానితో గ్రామపంచాయతీ ప్రజల అభివృద్ధి, ఇతరేతర కొత్త అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టాల్సి ఉంటుంది.
- వి.ఉపేందర్‌రెడ్డి,
పంచాయతీ సెక్రటరీ, పిర్జాదిగూడ, రంగారెడ్డి.

No comments:

Post a Comment

 
Design by Free WordPress Themes | Bloggerized by Lasantha - Premium Blogger Themes | Hot Sonakshi Sinha, Car Price in India